సూరహ్ అల్-అన్ఫాల్, పవిత్ర ఖురాన్‌లో 8వ అధ్యాయం, 75 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఓ ప్రవక్తా మీ సహచరులు యుద్ధప్రాప్తి గురించి దానిని ఏ విధంగా పంచిపెట్టాలి ?,దానిని ఎవరికి పంచిపెట్టాలి ? అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఓ ప్రవక్తా మీరు వారి ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా పలకండి : యుద్ధప్రాప్తి అల్లాహ్ కు ,ప్రవక్తకు చెందినది. దాన్ని ఖర్చు చేయటం గురించి,పంచిపెట్టటం గురించి ఆదేశము అల్లాహ్ ది,ఆయన ప్రవక్తది.