సూరహ్ అల్-హదీద్, పవిత్ర ఖురాన్‌లో 57వ అధ్యాయం, 29 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఆకాశములలో మరియు భూమిలో ఉన్న ఆయన సృష్టి రాసులన్నీ అల్లాహ్ పరిశుద్ధతను మరియు ఆయన అతీతను కొనియాడుతున్నవి. మరియు ఆయన ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు,తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో వివేకవంతుడు.