సూరహ్ అల్-జుముఅ

సూరహ్ అల్-జుముఅ, పవిత్ర ఖురాన్‌లో 62వ అధ్యాయం, 11 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని సృష్టితాలు అల్లాహ్ కు తగని లోపములు ఉన్న గుణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతున్నవి మరియు ఆయన అతీతను తెలుపుతున్నవి. ఆయన ఒక్కడే రాజ్యమును ఏలే ఏకైక రాజాది రాజు, ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు. ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు.