సూరహ్ సబా, పవిత్ర ఖురాన్‌లో 34వ అధ్యాయం, 54 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే ఆకాశముల్లో ఉన్నవన్నీ, భూమిలో ఉన్నవన్నీ సృష్టిపరంగా,అధికారపరంగా పర్యాలోచనపరంగా ఆయనకే చెందుతాయి. పరలోకములో పొగడ్తలు పరిశుద్ధుడైన ఆయన కొరకే. మరియు ఆయన తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు. తన దాసుల స్థితులను గురించి తెలుసుకునే వాడు. వాటిలో నుండి ఏది ఆయనపై గోప్యంగా ఉండదు.