సూరహ్ అస్-సఫ్ఫ్, పవిత్ర ఖురాన్‌లో 61వ అధ్యాయం, 14 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అల్లాహ్ పరిశుద్దతను మరియు ఆయనకు తగని వాటి నుండి ఆయన అతీతను తెలుపుతున్నవి. మరియు ఆయన ఎవరు ఓడించని సర్వాధిక్యుడు, తన సృష్టించటంలో మరియు తన విధి వ్రాతలో మరియు తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.