సూరహ్ అర్-రఅద్

సూరహ్ అర్-రఅద్, పవిత్ర ఖురాన్‌లో 13వ అధ్యాయం, 43 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఓ ప్రవక్తా ఈ సూరహ్ లో ఉన్న ఈ ఆయతులు ఎంతో మహోన్నతమైనవి. మరియు మీపై అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ ఎటువంటి సంశయం లేని సత్యము. మరియు అది అల్లాహ్ వద్ద నుండి కావటంలో ఎటువంటి సందేహం లేదు. కాని చాలా మంది ప్రజలు మొండితనము, గర్వము వలన దాన్ని విశ్వసించటం లేదు.