సూరహ్ అల్-బఖరా

సూరహ్ అల్-బఖరా, పవిత్ర ఖురాన్‌లో 2వ అధ్యాయం, 286 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

{الم} ఖుర్ ఆన్ లోని కొన్ని సూరాలు ఈ అక్షరాల ద్వారా ఆరంభం చేయబడినవి. ఇవి విడివిడిగా ఇలా (أ، ب، ت، إلخ) వచ్చినప్పుడు ఎటువంటి అర్ధం లేని అక్షరాలు. అవి అలా రావటానికి ఒక విజ్ఞత మరియు ఉద్దేశం ఉన్నది. ఖుర్ఆన్ లో విజ్ఞత లేనిది ఏదీ లేదు.