సూరహ్ అల్-హుజురాత్

సూరహ్ అల్-హుజురాత్, పవిత్ర ఖురాన్‌లో 49వ అధ్యాయం, 18 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు మాట పరంగా లేదా చేత పరంగా అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను మించిపోకండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ మాటలను వినేవాడును మరియు మీ కార్యాలను తెలుసుకునేవాడును.