సూరహ్ అన్-నూర్, పవిత్ర ఖురాన్‌లో 24వ అధ్యాయం, 64 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఈ సూరాను మేము అవతరింపజేశాము. మరియు మేము దానిలోని ఆదేశాలను ఆచరించటంను అనివార్యం చేశాము. మరియు మేము దానిలో స్పష్టమైన ఆయతులను వాటిలో కల ఆదేశాలను మీరు గుర్తు చేసుకుని వాటి ప్రకారం ఆచరిస్తారని ఆశిస్తూ అవతరింపజేశాము.