సూరహ్ అత్-తగాబున్

సూరహ్ అత్-తగాబున్, పవిత్ర ఖురాన్‌లో 64వ అధ్యాయం, 18 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.

ఆకాశములలో ఉన్నవన్ని మరియు భూమిలో ఉన్నవన్ని సృష్టితాలు అల్లాహ్ కు తగని లోపములు ఉన్న గుణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతున్నవి మరియు ఆయన అతీతను తెలుపుతున్నవి. రాజ్యాధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయన తప్ప రాజ్యాధికారి ఎవరూ లేరు. మంచి పొగడ్తలు ఆయనకే చెందుతాయి. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు.