సూరహ్ అల్-అఅరాఫ్, పవిత్ర ఖురాన్‌లో 7వ అధ్యాయం, 206 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఓ ప్రవక్తా అల్లాహ్ మీపై అవతరింప జేసిన గ్రంధం ఖుర్ఆన్. దాని గురించి మీ హృదయంలో ఎటువంటి చికాకు గాని,సంకోచముగాని ఉండకూడదు. దాని ద్వారా మీరు ప్రజలకు భయపెట్టటానికి,వాదించటానికి,దాని ద్వారా మీరు విశ్వాసపరులకి హితోపదేశం చేయటానికి ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. వారే (విశ్వాసపరులు) హితోపదేశం ద్వారా లబ్ది పొందుతారు.