సూరహ్ అజ్-జుమర్, పవిత్ర ఖురాన్‌లో 39వ అధ్యాయం, 75 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
ఖుర్ఆన్ అవతరణ ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడైన అల్లాహ్ వద్ద నుండి జరిగింది. తన సృష్టించటంలో మరియు తన పర్యాలోచనలో మరియు తన ధర్మ శాసనాల్లో వివేకవంతుడు. అది పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కాకుండా ఇతరుల వద్ద నుండి అవతరించలేదు.