సూరహ్ ఫాతిర్, పవిత్ర ఖురాన్‌లో 35వ అధ్యాయం, 45 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
పొగడ్తలన్నీ పూర్వ నమూనా లేకుండా ఆకాశములను,భూమిని సృష్టించినవాడైన అల్లాహ్ కే చెందుతాయి. ఆయనే దైవదూతలను సందేశాలను చేరవేసేవానిగా చేశాడు వారు ఆయన విధి ఆదేశాలను నిర్వర్తిస్తుంటారు మరియు వారిలో నుండి దైవప్రవక్తలకు దైవ వాణిని చేరవేసేవారు ఉన్నారు. మరియు ఆయన వారికి ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించటంపై బలమును చేకూర్చాడు.