సూరహ్ అత్-తలాఖ్, పవిత్ర ఖురాన్‌లో 65వ అధ్యాయం, 12 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఓ ప్రవక్తా మీరు లేదా మీ సమాజము నుండి ఎవరైన తమ భార్యకు విడాకులు ఇవ్వదలచినప్పుడు ఆమె గడువు (ఇద్దత్) ఆరంభంలో ఆమెకు విడాకులివ్వండి. విడాకులు శుద్ధావస్తలో ఇవ్వాలి అందులో ఆమెతో సంబోగించకుండా ఉండాలి. ఆ గడువులో మీరు వారి వైపు మరలదలచుకుంటే మీ భార్యల వైపు మరలే అధికారం మీకు కలగటానికి.