సూరహ్ ఇబ్రాహీమ్

సూరహ్ ఇబ్రాహీమ్, పవిత్ర ఖురాన్‌లో 14వ అధ్యాయం, 52 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

ఓ ప్రవక్తా ఈ ఖుర్ఆన్ మీ వైపునకు మేము అవతరింపజేసిన గ్రంధము. మీరు ప్రజలను అవిశ్వాసము,అజ్ఞానము,అపమార్గము నుండి విశ్వాసము,జ్ఞానము,ఎవరు ఆధిక్యతను చూపని ఆధిక్యత కలిగిన,అన్ని విషయాల్లో సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ మార్గమైన ఇస్లాం ధర్మం వైపునకు అల్లాహ్ నిర్ణయంతో,ఆయన సహాయంతో మార్గదర్శకత్వము చేయటానికి.