సూరహ్ అల్-హజ్జ్, పవిత్ర ఖురాన్‌లో 22వ అధ్యాయం, 78 ఆయతులతో కూడిన మదనీ సూరహ్.
ఓ ప్రజలారా మీరు మీ ప్రభువుకు ఆయన మీకు ఆదేశించిన వాటిని పాటించి, మిమ్మల్ని ఆయన వారించిన వాటిని విడనాడి భయపడండి. నిశ్చయంగా ప్రళయదినానికి తోడుగా జరిగే భూ ప్రకంపనలు,ఇతర భయాందోళనలు పెద్ద విషయము. అల్లాహ్ కి ఇష్టమైన కార్యలను చేసి దాని కొరకు సిద్ధం కావటం తప్పనిసరి.