సూరహ్ అల్-ఫాతిహా, పవిత్ర ఖురాన్‌లో 1వ అధ్యాయం, 7 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.
అల్లాహ్ పేరుతో ఆయన సహాయాన్ని అర్ధిస్తూ, ఆయన శుభనామంతో శుభాన్ని ఆశిస్తూ ఖుర్ఆన్ గ్రంధ పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను. మరియు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ లో అల్లాహ్ యొక్క ఉత్తమమైన మూడు పేర్లు ప్రస్తావించబడ్డాయి అవి : 1) అల్లాహ్ : అనగా నిజ ఆరాధ్యదైవం. ఇది ఆయన పేర్లలో ఆయనకు మాత్రమే ప్రత్యేకించబడినది.