సూరహ్ అల్-మువ్మినూన్

సూరహ్ అల్-మువ్మినూన్, పవిత్ర ఖురాన్‌లో 23వ అధ్యాయం, 118 ఆయతులతో కూడిన మక్కీ సూరహ్.

నిశ్ఛయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారూ,ఆయన ధర్మము ప్రకారం ఆచరించే వారు తాము కోరిన వాటిని పొందటం ద్వారా,తాము భయపడే వాటి నుండి విముక్తిని పొందటం ద్వారా సాఫల్యం చెందారు.